నెల్లూరు: సంగం బ్యారేజ్‌కి గౌతమన్న పేరు పెట్టిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబమంతా రుణపడి ఉంటుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు ప్రజలు కూడా సీఎంకు రుణపడి ఉంటారన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించిన నాటి నుంచి కుటుంబానికి అండగా ఉంటూ తనను ఎమ్మెల్యేగా నిలబెట్టిన సీఎం వైయస్‌ జగన్‌కు విక్రమ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ప్రతీ ఇంట్లో ప్రజల్లో సంతోషం కనిపిస్తుందన్నారు. ప్రతీ పేదవాడు జీవితంలో ఎదగడానికి అవకాశం ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరిక.. సంక్షేమ పథకాల సాయంతో ఫలించిందన్నారు. ఏ ఇంటికి వెళ్లినా సంతోషం, ఏ చిన్నారిని అడిగినా డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్‌ అని చెబుతున్నారు. అది సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన నమ్మకంతోనే సాధ్యమైందన్నారు. పరిపాలనను గ్రామస్థాయికి తీసుకువచ్చిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌ అని మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ వల్ల నెల్లూరు డెల్టా రీజన్‌కి 5 లక్షల ఎకరాలు సాగుచేసుకునే అవకాశం ఉందన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.