హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11.30 ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో దివంగతులైన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి), పరిపాటి జనార్దన్‌రెడ్డి (కమలాపూర్‌)కి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మండలిలోనూ మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డికి సంతాపం ప్రకటించారు. సంతాప తీర్మానాల అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12కు వాయిదా పడ్డాయి.

సభ వాయిదా అనంతరం స్పీకర్‌ చాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండా, సభ నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 12, 13 వ తేదీన రెండు రోజుల పాటు సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలాఉండగా.. ఈ నెల 7న కశ్మీర్‌ నుంచి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో’యాత్రను ప్రారంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.