దుమ్కా: ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా నేరాలకు నెలవుగా మారుతోంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ బాలికపై యువకుడు పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన మరువక ముందే ఓ బాలికపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల తన కుమార్తెపై అత్యాచారం చేసి ఆపై చంపేసి చెట్టుకు వేలాడదీశారని బాధిత బాలిక తల్లి ఆరోపించింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిందీ ఘటన.
నిందితుడిని అర్మాన్ అన్సారీగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణ రంగ కార్మికుడు అయిన నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను తొలుత హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు ఉరివేశారా? లేదా? అన్న విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దుమ్కా సివిల్ సర్జన్ మాత్రం బాలిక 8-10 నెలల గర్భవతి అని నిర్ధారించారు. నిందితుడు అర్మాన్ అన్సారీపై వీలైనంత త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (NCPCR) సోమవారం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని సందర్శించనుంది.
బాధిత బాలిక దుమ్కాలో తన పిన్నమ్మతో కలిసి ఉండేది. ఈ క్రమంలో అన్సారీతో ఆమెకు సంబంధం ఏర్పడింది. అమ్మాయి తనను పెళ్లి చేసుకోమని అన్సారీని కోరగా అతడు ఆమెను చంపేశాడని చెబుతున్నారు. ఆ తర్వాత ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో గర్భిణి అని తేలింది.

By admin

Leave a Reply

Your email address will not be published.