అమరావతి: విద్వేషం, విధ్వంసమే వైసీపీ (YCP) అజెండా అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla narendra) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడున్నరేళ్లలో పోలవరం (Polavaram project) పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని మండిపడ్డారు. టీడీపీ(TDP) హయాంలో పోలవరం పనులు 71 శాతం పూర్తి అయినట్లు గుర్తు చేశారు. పోలవరం ముంపు వాసులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణంలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే పక్క రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కేసుల మాఫీ కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీని మార్చి పోలవరాన్ని ముంచారని ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.