అమరావతి: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నేతలు(TDP Leaders) నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ(chennupati gandhi) పై హత్యాయత్నం జరిగితే, పోలీసులు కేసు నీరుగార్చుతున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చెన్నుపాటి గాంధీపై జరిగిన హత్యాయత్నంలో గాయం నివేదిక లేకుండా పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీలు, వైద్యుల నివేదికలు పట్టుకుని పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ (TDP) ధర్నాకు దిగింది.

By admin

Leave a Reply

Your email address will not be published.