కడప: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎర్ర చందనం అక్రమరవాణాపై పోలీసులు దాడలు నిర్వహించారు. ఒంటిమిట్ట పరిధిలోని లంకమల్ల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్ జిల్లా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 49 ఎర్రచందనం దుంగలు, రవాణాకు ఉపయోగించిన 2 కార్లు, 2 బైక్స్, 7 మొబైల్స్, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పీడీయాక్టుతో పాటు కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.