తాడేపల్లి: రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే జరగాలా అని నిలదీశారు. సీఆర్‌డీఏ చట్టం సవరణ చేసినట్లు ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్‌ అయ్యారు. గురువారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.రాజధానిలో పేదలు, బడుగులు ఉండకూడదా? బాబు పాలనలో దోచుకుని దాచుకోవడం పనిగా పెట్టుకున్నారు. రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. పాదయాత్ర అంటూ మళ్లీ డ్రామా మొదలు పెట్టారని పేర్ని నాని నిప్పులు చెరిగారు.

కలెక్షన్‌ ఫుల్‌.. సానుభూతి నిల్‌
పాదయాత్రకు కలెక్షన్‌ ఫుల్‌.. సానుభూతి నిల్‌.. ఉద్యమం పేరుతో వసూళ్ల రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆహా ఓహో అంటూ గతంలో రాతలు రాసిన ఎల్లో మీడియా.. 600 హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎందుకు ప్రశ్నించలేదు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వారికి కనిపించవా? అని ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో వసూళ్ల రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా అని ప్రశ్నించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.