గోదావరి: తాడేపల్లిగూడెం మండలం కోండ్రుపోలు జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయిన కోడిగుడ్ల లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన తణుకు నుంచి నూజివీడు వెళ్తుండగా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు బాధితులను తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.