సిద్ధిపేట జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు(suicide) పాల్పడింది. ములుగు మండలం అడవి మజీద్ గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే అనుమానంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహేష్ (26), స్వప్న(22)గా పోలీసులు గుర్తించారు. ప్రేమజంట ఆత్మహత్యపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.