ఎట్టకేలకు ఇంజనీరింగ్‌, ఫార్మా కోర్సుల అడ్మిషన్లకు సంబంధించిన ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌పై సాంకేతిక విద్యాశాఖ తేదీలు ప్రకటించింది. ఇప్పటికే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ముగిసి వారం రోజులు కాగా మంగళవారం నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చింది. ఈనెల 17 వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. 18న ఆప్షన్లలో మార్పులు కావాలంటే చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 22న సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తారు. 23 నుంచి 27లోపు కాలేజీల్లో విద్యార్థులు జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలి. 26 నుంచే తరగతులు ప్రారంభమవుతాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటుచేసినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఈ కేంద్రాల్లో మొబైల్‌ నంబర్లు మార్చుకునే అవకాశం ఉందని, 22వ తేదీ సాయంత్రం 6గంటల తర్వాత సీట్ల కేటాయింపు జాబితా విడుదలవుతుందని వివరించింది. కాగా రాష్ట్రంలో సుమారు 1.24లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు ఉంటే లక్ష మందికిపైగా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. సాంకేతిక విద్యాశాఖ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ను గందరగోళం చేసింది. షెడ్యూలు ప్రకారం గతనెల 28 నుంచే విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాలి. కానీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల కోసం దానిని వాయిదా వేశారు. అయితే, ఫలితాలు విడుదలైనా కౌన్సెలింగ్‌పై మౌనం వహించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.