జిల్లాలోని రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం శివారు మెట్టగూడెం సెంటర్‌లో గల వివాదాస్పద స్థలంలో గత రాత్రి వైసీపీ నేతలు (YCP Leaders) దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని (YSR Idol) ఏర్పాటు చేశారు. దాదాపు 15 ఏళ్లుగా విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నడుస్తోంది. మెట్టగూడెం సెంటర్‌లో విగ్రహం ఏర్పాటుపై పోలీసులు ఆంక్షలు విధించారు. గతంలో వైఎస్‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు యత్నించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గణేష్ నిమజ్జనం (Ganesh immersion) ఉత్సవం ఊరేగింపు సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. వైసీపీ నాయకుల చర్యను స్థానిక ప్రజలు ఖండించారు. వివాదాస్పద స్థలంలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని, తక్షణమే వైఎస్సార్‌ విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు

By admin

Leave a Reply

Your email address will not be published.