ఒకరు కాదు… ఇద్దరు కాదు వేలాది మంది బాధితులు. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా రూ.300 కోట్లు కొట్టేశాడు. ఉద్యోగాలు ఆశ చూపి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నిరుద్యోగులను నిండా ముంచేసిన ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ వ్యవస్థాపకుడు, నర్సీపట్నంకు చెందిన సుధాకర్‌ మోసాలు బట్టబయలవుతుంటే సీఐడీ పోలీసులకే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఉత్తరాంధ్రలోని ప్రతి మండలం నుంచి కనీసం 20 మంది చొప్పున బాధితులున్నారు. ఒకొక్కరి నుంచి రూ.1.5 లక్షల నుంచి ఐదు లక్షలు వరకు కాజేశాడు. ఇలా దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమిక ఆధారాల మేరకు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రెండు రోజుల క్రితం సీఐడీ పోలీసులు సుధాకర్‌ను అరెస్టు చేశారన్న సమాచారం తెలియడంతో… సోమవారం భారీ సంఖ్యలో బాధితులు నగరంలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తాము మోసపోయిన తీరును పోలీసుల ముందు ఏకరువు పెట్టారు. బాధితుల కథనం మేరకు… ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ వ్యవస్థాపకుడు సుధాకర్‌ గ్రామాల్లో ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.