సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కడపటి వార్తలందేసరికి ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బం ది, స్థానికుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు రోడ్డులో.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ ఎలక్ట్రికల్‌ షోరూం కొనసాగుతోంది. సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గోదాము ఉంది. రాత్రి 8.45 సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్‌ పేలిపోయింది. చూస్తుండగానే మంటలు ఇతర వాహనాలకు వ్యాపిం చి, ఒక్కొక్కటిగా పలు వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. రాత్రి కడపటి వార్తలందేసరికి కూడా ఈ-స్కూటర్ల బ్యాటరీల పేలుళ్లు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో గోదాములో ఎవరూ లేకున్నా.. పై అంతస్తుల్లో ఉన్న రూబీ హోటల్‌ గదులకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో 25 మంది బసచేసినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగ, మంటలతో ఉక్కిరిబిక్కిరైన మరో ఐదుగురు ప్రాణభయంతో కిందకు దూకారు

By admin

Leave a Reply

Your email address will not be published.