రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో అయితే ఇంకా ఎక్కువగానే వుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బిజెపిని రోజూ ఘాటుగా విమర్శిస్తుంటే, బిజెపి (bjp)వాళ్ళు కూడా దీటుగా సమాధానాలు ఇస్తున్నారు, అలాగే ఈసారి ఎలా అయినా తెలంగాణాలో పాగా వెయ్యాలని చూస్తున్నారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో ఒకటి సినిమా నటీనటుల్ని తమ పార్టీలోకి ఆహ్వానించటం. ఆ మధ్య జూనియర్‌ ఎన్టీఆర్‌ని, తర్వాత నితిన్‌ని కలిశారు పార్టీ పెద్దలు. అలాగేఈ మధ్య బీజేపీ తెలంగాణ సారధి బండి సంజయ్‌ నటి, దర్శకురాలు నిర్మాత అయినా జీవిత రాజశేఖర్‌(Jeevitha rajasekhar)ను పార్టీలోకి ఆహ్వానించినట్టు ఒక బోగట్టా. జీవిత మొదటి నుంచీ బిజెపిలోనే వున్నా, మధ్యలో వై ఎస్‌ జగన్‌ బలవంతం మీద ఆ పార్టీ కి ప్రచారం చేసినట్టుగా తెలిసింది. ప్రచారం చేసినంత మాత్రాన ఆ పార్టీలో చేరిపోయినట్టు కాదని, ఆ పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోలేదని ఆమె అన్నట్టుగా తెలిసింది. అందుకే ఆమె, ఆమె భర్త రాజశేఖర్‌ ఇద్దరూ బిజెపి లోనే ఉన్నామని, కానీ మీరే పట్టించుకోవటం లేదని, సంజయ్‌ కి చెప్పినట్టుగా తెలిసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.