మినీ వ్యాన్‌ బోల్తా పడటంతో హైదరాబాద్‌కు చెందిన 19 మంది గాయాలపాలైన ఘటన సోమవారం తిరుపతి రూరల్‌ మండలంలో చోటుచేసుకుంది. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలుకాగా… మిగిలిన 17 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 19మంది శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నాక తిరుమలలో మినీవ్యాన్‌ మాట్లాడుకుని శ్రీనివాస మంగాపురం, కాణిపాకం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి రూరల్‌ మండల పరిధిలోని బాలాజీ డెయిరీ ప్రాంతంలో ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పిన మినీ వ్యాన్‌ రోడ్డుపైనుంచి పల్లంలోకి వెళ్లిపోయి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న వారంతా గాయపడ్డారు. వీరిలో పద్మజ (45), మంజుల (45)కు తీవ్ర గాయాలు కాగా రుయా ఆసుపత్రికి తరలించారు

By admin

Leave a Reply

Your email address will not be published.