అనంత‌పురం: ప్ర‌జ‌లు సంతోషంగా జీవించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని 15 వ వార్డులో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పధకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతి పరిరక్షణ పేరుతో చేపట్టిన యాత్ర పాదయాత్ర కాదని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు చేస్తున్న దాడి.. అని మండిప‌డ్డారు. రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్ర వెనుకబాటుకు టీడీపీయే కారణమని, ఇప్పుడు విశాఖను పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అన్ని వసతులు ఉండి, ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేయడాన్ని టీడీపీ వ్యతిరేకించడం దారుణమన్నారు. చంద్రబాబు వేసిన కమిటీ తప్ప మిగతా ఏ కమిటీలూ అమరావతిని రాజధానిగా చేయాలని సూచించలేదని చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనన్నారు. బాబు రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతారని పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధా నులు ఏర్పాటు చేయాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ నిర్ణయించారని తెలి పారు. మూడు రాజధానుల తోనే సమన్యాయం, సమధర్మం, అభివృద్ధి సాధ్యమవుతుందని పునరు ద్ఘాటించారు. టీడీపీ కుటిల రాజకీయాన్ని రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్ర ప్రజలు, మేధావులు, యువత అర్థం చేసుకోవాలని మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published.