‘ఆహా’లో ‘అల్లుడు గారు’ రాబోతున్నారు. కొత్త వెబ్‌ సిరీస్‌తో ఆహా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ‘అల్లుడు గారు’ అనే టైటిల్‌తో ఓ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. అభిజీత్ పూండ్ల, ధన్య బాలకృష్ణ, వై కాశీ విశ్వనాథ్, సుధ, షాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ని ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి’ ఫేమ్‌ జయంత్‌ గాలి డైరెక్ట్ చేశారు. తమడ మీడియా నిర్మించింది. మోడ్రన్‌ డే రిలేషన్‌ షిప్స్, అందులో ఉన్న కాంప్లికేషన్స్‌ని ఫోకస్ చేసేలా తెరకెక్కిన ఈ షోని బ్రూ ప్రెజెంటర్‌గా స్పాన్సర్‌ చేస్తోంది. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 29న విడుదల కానుంది.

‘అల్లుడు గారు’ స్టోరీ గురించి మేకర్స్ చెబుతూ.. కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ స్టోరీ. కొత్తగా పెళ్లైన జంట అజయ్‌ (అభిజిత్‌ పూండ్ల), అమూల్య (ధన్య బాలకృష్ణ) చుట్టూ తిరుగుతుంది. సాంప్రదాయక కుటుంబంలో తన అత్తమామలు నళిని(సుధ), అశోక్(వై కాశి విశ్వనాథ్)లతో ఉండవలసి వచ్చిన అజయ్ పరిస్థితిని సరదాగా తెరకెక్కించాం. మొదట్లో వాళ్లతో ఇమడలేకపోయినప్పటికీ, వాళ్ల అభిరుచులకు తగ్గట్టు ప్రవర్తించడానికి అజయ్‌ చాలానే కష్టపడతాడు. అతని ఆలోచనలు, అభిరుచులు ఇంకో రకంగా ఉంటాయి. అయినా పెద్దల మధ్య ఉండాల్సి వచ్చినప్పుడు అతను ప్రవర్తించే విధానం కడుపుబ్బా నవ్విస్తుంది. అతని కేరక్టర్‌తో చాలా మంది సహానుభూతి చెందుతారు.. అని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.