అమరావతి స్కామ్‌కు పునాది వేసింది చంద్రబాబే అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రాంతాల మధ్య విధ్వేషాలు సృష్టించేందుకు అమరావతి పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్‌ అని, అమరావతి ప్రజా రాజధాని కాదని నాడు జనసేన, సీపీఐ, సీ పీఎం నేతలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు వాల్లే పాదయాత్రకు డప్పులు కొడుతున్నారని తప్పుపట్టారు. పాదయాత్రలో ఒక్క రైతైనా ఉన్నారా అని మంత్రి ప్రశ్నించారు. బుధవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

పోలవరంపై చర్చిద్దామంటే చంద్రబాబు అసెంబ్లీకి రావాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. శాసనసభ వేదికగా పోలవరంపై చర్చిద్దామని సవాలు విసిరారు. చంద్రబాబు 2018 కల్లా పోలవరం ఎందుకు పూర్తి చేయాలేదని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణమన్నారు.

అమరావతి నుంచి అరసవెళ్లి వరకు పాదయాత్రనా? ఇది ప్రజల పాదయాత్ర కాదు. ఇది ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు, రియల్‌ ఎస్టేట్‌ చేసుకునేందుకు చేరస్తున్న పాదయాత్ర, రెండు చేతులతో సంపాదించుకునేందుకు చేస్తున్న పాదయాత్ర. రాజధానిపై ఎంత మంది విమర్శలు చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత అమరావతిలో రాజధాని పెట్టాలని అక్కడ భూములు కొని రాష్ట్రంలో చంద్రబాబు స్కామ్‌కు పునాది వేశారు. పూర్వం చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన ఐవీఆర్‌ కృష్ణరావు ఒక పుస్తకం రాశారు. ఈ రాజధాని ఎవరిది అన్నది ఆ పుస్తకం, ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్‌ ఆవిష్కరిస్తే..ఆకార్యక్రమానికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నాయకులు హాజరయ్యారు. ఆ సమయంలో వారు ఏం చెప్పారో ఒకసారి గమనించండి. ఏపీ ఒకసారి మోసపోయిందని ఆ రోజు చెప్పారు. హైదరాబాద్‌లోనే అన్ని కేంద్రీకరించడంతో అక్కడ మోసపోయాం. వికేంద్రీకరణ జరగాలని ఆ వేదికపై ఉపన్యాసాలు చేశారు. ఇది ధర్మమేనా సీపీఐ, సీపీఎం, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. రేపో ఎల్లుండి ఆ పాదయాత్రలో దూరుతారు. తాను మద్దతు ఇస్తున్నానని చెబుతారు.

By admin

Leave a Reply

Your email address will not be published.