తాడేపల్లి: రైతుల పేరుతో చేపట్టిన అమరావతి యాత్ర..రాజకీయ యాత్ర అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకున్నారని గుర్తు చేశారు. బలహీన వర్గాలకు చోటు లేని రాజధాని ఎవరి కోసమని ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని ప్రజలకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందా లేదా అన్నది ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబు చేసిన మేలు ఏంటో గమనించాలన్నారు. చంద్రబాబు స్వార్థం కోసం ప్లాన్‌ చేసిన రాజకీయ యాత్ర అని ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడారు.

అమరావతి పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు తనకు సంబంధించిన రియల్టర్లకు కోట్ల రూపాయల ఆదాయం రావాలనే దుర్భుద్ధితో అమరావతి చుట్టూ వంద కిలోమీటర్లు గ్రీన్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఈ వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల మెడకు ఉరితాడు బిగించింది వాస్తవం కాదా?. ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు రాకూడదు. ఎలాంటి కట్టడాలు రాకూడదని జీవోలు ఇచ్చింది వాస్తవం కాదా చంద్రబాబు. ఈ రోజు వీటిపై చర్చించేందుకు ధైర్యం లేక అసెంబ్లీ నుంచి చంద్రబాబు పారిపోయారు. కుట్ర పూరిత ఆలోచనలతో ఆయన పెట్టిన అప్పటిమంత్రులు నారాయణ, శ్రీనివాసులును ముందు పెట్టి ప్రజా రాజధాని అని మభ్యపెట్టారు. పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకున్న చంద్రబాబు..తాను అధికారంలో ఉన్నప్పుడు కోటిశ్వరులకు కారుచౌకగా ఎందుకు భూములు కట్టబెట్టారు. పేదవాళ్లకు స్థలాలు ఇస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.