79750సాగర్: గుప్పెడు బాదం గింజలు ఎంతుంటాయి? మహా అయితే రూ. 100లోపే ఉంటాయి. మరి రెండుమూడు గింజలైతే ఓ రూ. 10-20 ఉంటాయి కావొచ్చు. వాటిని దొంగిలించాడని ఓ బాలుడిని పట్టుకున్న ఆలయ పూజారి చెట్టుకు కట్టేసి చావబాదాడు. దేవుడికి నిత్య కైంకర్యాలు చేసే ఆ పూజారిలోని క్రూరత్వం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిందీ ఘటన. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కరీలాలోని జైన్ సిద్దయటన్ మందిర పూజారి రాకేశ్ జైన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.