రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో విద్యార్థులతో వెళుతున్న ప్రైవేటు స్కూలు బస్సు(Private school bus) ఉన్నట్టుండి దగ్ధమైంది. అరక్కోణం జ్యోతినగర్‌లోని ప్రైవేట్‌ మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌సెకండరీ స్కూలు బస్సు సేందమంగళం ప్రాంతానికి చెందిన నలుగురు విద్యార్థులతో శనివారం ఉదయం బయలుదేరింది. ఆ బస్సును శీనివాసన్‌ (31) అనే డ్రైవర్‌ నడిపారు. ఆ బస్సు రైల్వేగేట్‌ సమీపంలో వెళుతుండగా ఉన్నట్టుండి ముందుభాగంలో నిప్పుమంటలు చెలరేగాయి. వెంటనే శీనివాసన్‌ బస్సును నిలిపివేసి అందులోని నలుగురు విద్యార్థులకు కిందకు దింపారు. ఆలోపున నలువైపులా మంటలు వ్యాపించి బస్సు కాలసాగింది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం సభ్యులు హుటాహుటిన ఫైరింజన్‌తో వెళ్ళి సుమారు అరగంటసేపు పోరాడి మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో బస్సు పూర్తి దగ్ధమైంది

By admin

Leave a Reply

Your email address will not be published.