తిరువళ్లూర్‌ జిల్లా పొన్నేరి సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు మంగళవారం బాంబు బెదిరింపు(Bomb threat) ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది. ఈ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నాలుగు విభాగాలు పనిచేస్తుండగా, ఉదయం యధావిధిగా విద్యార్థులు పాఠశాలకు చేరుకున్న సమయంలో పాఠశాల నిర్వాహకుడు ఎం.శశికుమార్‌(M. Sasikumar) సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తి పాఠశాలలో బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో, ఆయన హుటాహుటిన పాఠశాలకు సెలవు ప్రకటించి విద్యార్థులను పాఠశాల వాహనాలు, ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు పంపారు. సమాచారం అందుకున్న గుమ్మిడిపూండి డీఎస్పీ క్రియాశక్తి నేతృత్వంలో బాంబ్‌ స్క్వాడ్‌(Bomb Squad) పాఠశాల గదులు, ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం పోలీసులు, బెదిరింపు కాల్‌ వచ్చిన నెంబరు ఆధారంగా విచారణ ప్రారంభించారు

By admin

Leave a Reply

Your email address will not be published.