Perni Nani భారత దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది.. 1931 వ సంవత్సరం స్వాతంత్య్రానికి ముందా.. తర్వాతా…? దీనికి సమాధానం అందరికీ తెలిసినా… ఏపీ మంత్రి పేర్ని నాని మాత్రం కాస్త తడబడ్డారు. బీసీ జన గణన గురించి మాట్లాడుతూ…. స్వాతంత్ర్యం తర్వాత 1931 లో ఒకే ఒకసారి జనగణన జరిగిందంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ మళ్లీ అలాగే అనబోతుండగా.. పక్కనే ఉన్న అధికారి… ఆయన్ను సరిచేశారు. దీంతో తడుముకుని.. అదే అదే స్వాతంత్య్రానికి ముందు అంటూ పేర్నినాని చెప్పుకొచ్చారు.