దిల్లీ: గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌.. చంద్రబాబుపై వాడిన భాష జుగుప్సాకరమని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. గురువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైకాపా నేతల తీరును తప్పుబట్టారు. ” భాష గురించి ఇప్పుడు జగన్‌ మాట్లాడటం దౌర్భాగ్యం. చంద్రబాబుపై మంత్రులు ఇష్టారీతిన మాట్లాడారు. ఇలాంటి భాష, సంస్కృతికి వైకాపానే కారణం. తెదేపా కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. కానీ, దాడి చేసిన వారిపై బెయిలబుల్‌ కేసులు పెట్టి, తెదేపా నేతలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారు. చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ను డీజీపీ వెనకేసుకొచ్చారు. చంద్రబాబుతో చర్చించడానికి జోగి రమేశ్‌ వచ్చారని డీజీపీ చెప్పుకొచ్చారు. పరుష వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సి వస్తే… మొదట వైకాపా గుర్తింపు రద్దు చేయాల్సి ఉంటుంది” అని కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.