అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష సభ్యుడు అచ్చెన్నాయుడుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. టీడీపీ సభ్యులు ఏం అంశం కావాలన్నా.. దానిపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శాసనసభ సజావుగా నడిచేలా, సభలో చర్చకు సహకరిస్తారా.. లేదా.. అని ప్రశ్నించారు. ప్రతిపక్షం కోరే ప్రతీ అంశంపైనా చర్చిస్తామన్నారు. అవసరమైతే ఈఎస్‌ఐ స్కాంపై కూడా చర్చిద్దామన్నారు. రాజధానిపై చర్చ కావాలంటే దానిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని బీఏసీ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.