అమ‌రావ‌తి: కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం వైయ‌స్ జగన్‌ పాలన సాగిస్తున్నార‌ని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం వైయ‌స్ జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. వికేంద్రీక‌ర‌ణ‌పై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో కొడాలి నాని మాట్లాడారు.

సీఎం వైయ‌స్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండీ ఆయన, ఆయన ప్రభుత్వం నడుస్తున్న విధానాన్ని పరిశీలిస్తే ఎక్కడా కులాలకీ, మతాలకి, రాజకీయాలకీ సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ, ప్రతి ప్రాంతానికీ మంచి చేయాలి, అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడాలి, అందరినీ చేయపట్టి ముందుకు నడిపించాలనే ఉద్దేశ్యం ఆయనలో ఉంది.

వికేంద్రీకరణ అంటే మూడు ప్రాంతాల్లో 3 రాజధానులు పెట్టడం మాత్రమే కాదు, ప్రతి 2వేల మందికి ఒక గ్రామ సచివాలయం ఉండాలి, అందులో 10 మంది ఉద్యోగులు ఉండాలి, ఆ ప్రాంతంలోఉన్న ప్రతి ఒక్కరికీ సేవలందాలి. వీటికోసం ప్రజలు ఏ మండలాఫిసుకో, మున్సిపల్ ఆఫీస్ కో వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఉండాలి, అక్కడ ఉద్యోగులు ఉండాలి. ఒక అప్లికేషన్ వచ్చిన 24గంల్లో పరిష్కారం చేయాలి. 16వేల గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టిన వ్యక్తి వైయస్ జగన్.

By admin

Leave a Reply

Your email address will not be published.