అమ‌రావ‌తి: క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం ప్రాజెక్టు ప్ర‌ణాళిక ప్ర‌కారం 36 నెల‌ల్లో పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తెలిపారు. రెండో రోజు స‌మావేశాల్లో టీడీపీ స‌భ్యులు బాల వీరాంజనేయస్వామి, అచ్చెన్నాయుడు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. భూసేకరణ, పర్యావరణ అనుమతి, ప్రభుత్వం 3148 ఎకరాల భూమి కేటాయించడమైంది. ఎన్‌హెచ్ 67 నుండి రోడ్డు అనుసంధానం, సరిహద్దు గోడ నిర్మాణం, విద్యుత్, నీటి నిర్వహణతో సహా మౌలిక సదుపాయాలు కల్పన పనులు పురోగతిలో ఉన్నాయి. రైలు అనుసంధానం ఆమోదం కోసం రైల్వేకి ప్రతిపాదనలు పంపడమైంది. ప్రాజెక్టు ప్రణాలిక ప్రకారం 36 నెల్లలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. భూసేకరణ, నిర్మాణ, విద్యుత్, ప్రహరీగోడ నిర్మాణం, పర్యావరణ అనుమతుల మొదలైన వాటి కోసం ఇప్పటి వరకూ రూ.46.67 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని మంత్రి స‌మాధానం ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.