అమరావతి: అప్పులపై దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై చర్చలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధాలుగా భావించి బటన్‌ నొక్కి మరి డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీ అప్పులపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. గతంలో దోచుకో, పంచుకో, తినుకో పథకం ఉండేది.

రాష్ట్ర విభజన నాటికి రూ.1.26 లక్షల కోట్లు అప్పు ఉండేది. ఆ అప్పు రూ.2.45 కోట్లకు చంద్రబాబు చేశారు. మేం రూ.8 లక్షల కోట్లు చేశామని ప్రతిపక్ష ఆరోపణలు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.100 కోట్లు మాత్రమే ఉందని యనమల రామకృష్ణుడు అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది మార్చి నాటికి కేవలం రూ.3,82,165 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉంది. మనం కేవలం రూ.1.15 కోట్లు మాత్రమే అప్పు చేశాం. ప్రజలకు అందించింది రూ. 1.25 లక్షల కోట్లు నేరుగా అందించాం.

By admin

Leave a Reply

Your email address will not be published.