గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju) మృతి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను ఏకకాలంలో చేస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రాజెక్ట్ K’ (Project K), ‘సలార్’ (Saalar) చిత్రాల షూటింగ్స్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. సడెన్‌గా కృష్ణంరాజు మృతి చెందడంతో.. ఇప్పుడా చిత్రాల షూటింగ్స్‌ని ఆపేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఒక నెల పాటు ప్రభాస్ ఎటువంటి షూటింగ్స్‌లో పాల్గొనకూడదనే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇటువంటి కష్టసమయంలో కుటుంబానికి తోడుగా నిలబడాలనే ప్రభాస్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published.