హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌నెం.10లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ (CM KCR) కాన్వాయ్‌ని టీఆర్పీఎస్ (TRPS) కార్యకర్తలు అడ్డుకున్నారు. గిరిజన రిజర్వేషన్లను వెంటనే పెంచాలంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను అరెస్ట్‌ చేసి తరలిస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. పోలీసులతో మహిళల తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరుగగా… పలువురు మహిళలు కిందపడిపోయారు. నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.