బాపట్ల: అమరావతి రైతుల మహా పాదయాత్ర (Maha Padayatra of Amaravati Farmers) ఆరో రోజు ప్రారంభమైంది. శనివారం ఉదయం ఐలవరం నుంచి మహాపాదయాత్ర మొదలైంది. రేపల్లె నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టింది. రైతులకు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ (Anagani satya prasad) స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సెప్టెంబర్ 12 నుంచి అమరావతి రైతులు మహా పాదయాత్ర-2ను ప్రారంభించారు. 900 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర కొనసాగనుంది. 60 రోజుల పాటు పాదయాత్ర సాగేలు రైతులు ప్రణాళికను రూపొందించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ పాదయాత్రగా వెళ్లనున్నారు. రాజధానిలోని 29 గ్రామాల నుంచి రైతులు, మహిళలు, వివిధ వర్గాల వారు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అలాగే రైతుల మహాపాదయాత్రకు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.