అక్రమంగా తరలిస్తున్న రూ.2.40 కోట్ల విలువైన సిగరెట్లను కాకినాడ కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ విభాగం, కస్టమ్‌ హౌస్‌ అధికారులు స్వాధీనం చేసుకుని సెంట్రల్‌ జీఎ్‌సటీకి అప్పగించారు. కాకినాడ కస్టమ్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ సాధు నరసింహారెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌.రఘురామ్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు. కాకినాడ జిల్లా బెండపూడి చెక్‌పోస్ట్‌ వద్ద ఓ లారీని తనిఖీ చేయగా బిహార్‌ రాష్ట్రం పాట్నా నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు అగ్గిపెట్టెల పేరుతో అక్రమంగా సిగరెట్లు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. రూ.2.40 కోట్ల విలువ చేసే సిగరెట్లను పన్ను చెల్లించకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.