ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra modi)కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (Birthday wishes) తెలిపారు. దేశానికి వరుసగా రెండుసార్లు ప్రధాన మంత్రిగా, గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అజేయ రాజకీయ విజయుడు అని కొనియాడారు. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు… అసామాన్యమైన భారతదేశపు ప్రధాన మంత్రి (Prime minister)గా నిలిచారంటే ఆ రాజకీయ ప్రయాణం ఎంత సంక్లిష్టమైనదో ఊహించవచ్చన్నారు. ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఆయన దార్శనికత, ప్రధాన మంత్రిగా క్లిష్టమైన, సున్నితమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలు మోదీని రాజకీయవేత్తగా అగ్రపథాన నిలిపాయని జనసేనాని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.