అమరావతి: టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla ramaiah), పలువురు పార్టీ నేతలు శనివారం ఉదయం మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్ చేరుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Central Office)పై వైసీపీ (YCP) దాడి చేసి నేటికి 11 నెలలు అయినప్పటికీ మంగళగిరి రూరల్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీసులను కలిసి ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య (TDP Leader) కోరారు. అనంతరం టీడీపీ నేత మాట్లాడుతూ… 11 నెలల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ ముష్కరులు దాడి చేసినా పోలీసులు చర్యలు శున్యమని మండిపడ్డారు. ఒకరిని కూడా ఇంతవరకు పట్టుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ పోలీసు వ్యవ్యస్త వల్ల ఇంక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.