విశాఖపట్నం: ఏపీ (Andhrapradesh) ఆర్థికవ్యవస్థ రోజురోజుకు క్షీణిస్తోందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు (GVL narasimha rao ) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ఆదాయ పరిస్థితి బాగుంటే.. రోడ్ల పరిస్థితి ఇలా ఎందుకుంటుందని ప్రశ్నించారు. బలమైన ఆర్థికవ్యవస్థ ఉందనడానికి ఏం ఆధారాలున్నాయని నిలదీశారు. 3 రాజధానుల ప్రతిపాదన.. ఒక రాజకీయ ఎత్తుగడ అని వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంశం కాదన్నారు. అమరావతి రైతుల (Amaravati farmers)కు బీజేపీ (BJP) ఎప్పుడూ అండగానే ఉంటుందని ఎంపీ జీవీఎల్‌ (BJP MP) అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.