విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎన్నో అంచనాలు పెట్టుకున్న లైగర్ (Liger) సినిమా బాక్సాఫీస్ (Box Office) వద్ద తలకిందులు అవ్వటంతో చాలా నిరాశ పడ్డాడు. కానీ, వెంటనే తేరుకొని.. తదుపరి సినిమా ఖుషి (Khushi) షూటింగ్ ప్రారంభించాడు. ఈ సినిమా చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది.. కానీ ఈ సినిమాకి కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇందులో నటిస్తున్న కథానాయిక సమంత (Samantha)కి ఏవో సమస్యలు రావటంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఆమె ఎప్పుడు వస్తుందా? అని విజయ్ మరియు ఇతర యూనిట్ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించటం లేదు.

By admin

Leave a Reply

Your email address will not be published.