అమ‌రావ‌తి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స‌వాలు విసిరారు. పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని ప్ర‌శ్నించారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తారట. ముందు సర్పంచ్‌లుగా గెలవండి.. తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి అంటూ హిత‌వు ప‌లికారు. మంత్రి రోజా సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా గెలవలేని పవన్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్‌ మీటింగ్‌లకు వస్తున్నార‌ని పేర్కొన్నారు.

ఇట్టాంటి సర్వేలే నమ్ముకుని గతంలో ‘జగన్ మోహన్ రెడ్డి సీఎం కాడు ఇది శాసనం’ అన్నావ్. శాసనం అన్న నిన్నే ప్రజలు
శాసన సభకి కూడా రానీయని విషయం మర్చిపోయావా?
175 చోట్ల జనసేనకు క్యాండేట్లు కూడా లేరు…వైయస్ఆర్‌సీపీని దించి అసెంబ్లీ మీద జనసేన జెండా ఎగరేస్తానంటాడు.
ఫస్ట్ కౌన్సిలర్లుగా గెలవండి, ఎంపీటీసీలు, సర్పంచులు గెలవండి తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం సంగతి ఆలోచిద్దురుగాని,,
. గ్రామాల్లో సినిమా పిచ్చితో ఉన్న పిల్లలు నీ మీటింగ్ లకు వచ్చారని రెచ్చిపోయి సీఎం అని కలలు కని నువు బొక్కబోర్లా పడ్డావ్.
నిన్ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోడానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారు.
సినిమాల నుంచి వచ్చిన ఎన్టీఆర్ పార్టీ పెట్టి సింగిల్ గా పోటీచేసారు. చిరంజీవిగారు పార్టీ పెట్టి సింగిల్‌ గా పోటీ చేసారు.
అదే రక్తం పంచుకుని పుట్టి నువ్ పార్టీ పెట్టి, పోటీ చేయడం మానేసి 2014లో బీజేపీకి ఓటేయండి టీడీపీకి ఓటేయండి అన్నావ్..
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది నువ్వు, నువ్ సపోర్టు చేసిన పార్టీలే.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకోని నువ్వు నేడు నోరు చించుకుని మాట్లాడుతున్నది ప్యాకేజీ కోసమేగా..
వైయ‌స్ జగన్ కేసీఆర్ తో కలిసి ఏపీకి రావాల్సినవి అన్నీ వదిలేసుకున్నాడని పవన్ అంటున్నాడు. ఓటుకునోటు కేసులో ఇరుక్కుని ఉమ్మడి రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చి కరకట్ట మీద కొంపలో దాక్కున్న చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?

బీజేపీ తప్పు చేసినా, టీడీపీ తప్పు చేసినా ప్రశ్నిస్తాను అన్న నువ్వు విభజన చట్టంలో మన ఆస్తులు రాకుంటే ఎందుకు మాట్లాడలేదు…ఆరోజు షూటింగ్ లో ఉన్నావా సూట్కేసులు తీసుకుంటున్నావా?

By admin

Leave a Reply

Your email address will not be published.