అమ‌రావ‌తి: పోల‌వ‌రాన్ని గ‌త ఐదేళ్లు చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని మంత్రి అంబటి రాంబాబు విమ‌ర్శించారు.టీడీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని సూచించారు. పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపుపై ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన వారికి 10 లక్షలు ఇస్తామని సీఎం వైయ‌స్ జగన్ హామీ ఇచ్చారు. భూ సేకరణ చట్టం వల్ల నష్టపరిహారం పెరిగిందన్నారు. గతంలో లక్షన్నర తీసుకున్నవారికి ఇప్పుడు మూడున్నర లక్షలు ఇస్తామన్నారు. కేంద్రం బాధితులకు న్యాయం చేయాల్సి వుందన్నారు. 2013 చట్టానికి ముందు కేవలం రూ. 1.50 లక్షలు పరిహరం పొందిన వారికి రూ. 5 లక్షలిస్తామన్నారు. ఆ కేటగిరిలో ఉన్న వారికి మిగిలిన రూ. 3.50 లక్షలు ఇస్తామని సీఎం వైయ‌స్‌ జగన్ హామీ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కొల్పోయిన వారికి మొత్తంగా రూ. 10 లక్షలు ఇస్తామని వైయ‌స్ జగన్ హామీ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేశామ‌ని మంత్రి అంబ‌టి రాంబాబు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.