అసెంబ్లీ: ‘‘చంద్రబాబు తెలివితేటలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చూస్తే అర్థం అవుతుంది. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు.. చంద్రబాబు అసలు ఎమ్మెల్యే కావడానికి కూడా అనర్హుడు. ఈ స్థాయిలో ప్రజలను మోసం చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోలవరంపై సీఎం వైయస్‌ జగన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను ఫొటోలు, వీడియోలతో సహా సభ సాక్షిగా వివరించారు. గతంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కింద చంద్రబాబు రూ.6.86 లక్షలు ఇస్తే.. దాన్ని రూ.10 లక్షలు చేస్తామని చెప్పాం.. అందుకు తగ్గట్టుగానే జీవో కూడా విడుదల చేశాం. దాని గురించి ఆక్షేపణ, చర్చ కూడాఅవసరం లేదన్నారు. 30–06–2021లో ఇచ్చిన జీవో చూడండి.. కళ్లు ఉండి చూడలేకపోతే ఏం చెప్పలేను గానీ, కళ్లుండి చూడగలిగితే దయచేసి చూడండి అని అసెంబ్లీలోని ఆ జీవోను సీఎం వైయస్‌ జగన్‌ ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

పోలవరం డ్యామ్‌ పూర్తయిన తరువాత మొదట నీటిని నిల్వ చేసేది 41.15 మీటర్ల ఎత్తుకు. డ్యామ్‌ సెక్యూరిటీ ప్రకారం కూడా డ్యామ్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం కూడా మంచిది కాదని సీడబ్ల్యూసీ నిబంధనలు కూడా చెబుతాయి. దానికి తగ్గట్టుగానే 41.15 మీటర్లకు మొట్టమొదటగా నీటిని నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కాంపన్సేషన్‌ పూర్తిగా పోలవరం ప్రాజెక్టులో లక్షా 6 వేల 6 మంది నిర్వాసితులకు 41.15 మీటర్ల కాంటూర్‌ వరకు సంబంధించి అందులో 20,946 మంది నిర్వాసితులు ఆ పరిధిలోకి రావడం జరుగుతుంది. మిగిలిన 85.60 వేల మంది నిర్వాసితులు 45.72 మీటర్ల లెవల్‌లోకి వస్తారు. వీరందరికీ పునరావాసం కల్పించాల్సి ఉండగా 41.15 మీటర్ల లెవల్‌కు సంబంధించి 14,110 నిర్వాసితులకు పునరావాసం పూర్తయింది. దీనికి అయిన మొత్తం ఖర్చు రూ.1960.95 కోట్లు. ఈ 14,110 నిర్వాసితుల్లో 707 నిర్వాసితులకు 2014 కంటే ముందే పునరావాసం కల్పించి రూ.44.77 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు 3,073 మంది నిర్వాసితులకు రూ.193 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అదే విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు 10,330 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 1772.78 కోట్ల ఖర్చు చేయడం జరిగింది. పునరావాస పనులు 41.15 మీటర్ల లెవల్‌ వరకు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌ 2022లోగా మిగిలిన 6,836 మందికి కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతుంది. మొత్తం 41.15 మీటర్ల వరకు చేర్పించడం కోసం అదనంగా ఇవ్వాల్సిన (6.80 లక్షలకు రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పాం) దానికి సంబంధించి అయ్యే ఖర్చు కేవలం రూ.500 కోట్లు మాత్రమే. దాని కోసం ఎవరూ భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. బటన్‌ నొక్కి అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాల కింద వేల కోట్ల రూపాయలు బటన్‌ నొక్కి ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం. అలాంటిది రూ.500 కోట్ల విషయంలో ఏదో పెద్ద పరిస్థితులు వస్తాయని ఎవరూ అనుకోవాల్సిన పనిలేదు. పునరావాసం కల్పించే కార్యక్రమం పూర్తయ్యేలోపు రూ.500 కోట్లు నిర్వాసితులకు ఇవ్వడం జరుగుతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.