అమరావతి: విజయనగరం జిల్లాకు ఇంతవరకు రాజ్యాంగబద్ధమైన పదవులు రాలేదని, కొలగొట్ల వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్‌గా కూర్చోబెట్టిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామి ఎన్నికైన సందర్భంగా సభలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు డిప్యూటీ స్పీకర్‌గా మీకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మీకు ఈ గౌరవాన్ని కల్పించిందనందుకు సీఎం వైయస్‌ జగన్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాసన సభలో సభాపతి స్థానం అంటే తండ్రి స్థానంగా భావిస్తాం. ఈ రోజు అలాంటి తండ్రిస్థానంలో తండ్రి సమానులైన మీరు కూర్చునందుకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా మీకు ఉన్నతమైన స్థానం రావాలని, మిమ్మల్ని అభిమానించే మాలాంటి వారు.. మన ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు, కార్యకర్తలు కోరుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని మన సీఎం వైయస్‌ జగన్‌ మీకు కల్పించారు. అందుకు మా ప్రజలు, కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీకు దక్కిన ఈ అవకాశం చాలా ప్రత్యేకమైంది. మన జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు రాజ్యాంగబద్ధమైన స్థానంలో కూర్చునే అవకాశం రాలేదు. ఇప్పటి వరకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మన జిల్లాకు చెందిన వారు ఎవరు పని చేయలేదు. ఈ రోజు ఆ రికార్డును మీరు సృష్టించారు. మీరు ఏం చేసినా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు ఈ పదవిని మొట్ట మొదటిసారిగా అలంకరించి మీరు రుజువు చేసుకున్నారు. మీరు నాకు తండ్రి సమానులు, నన్ను గాని, రాజు గారిని గాని రాజకీయంగా ప్రోత్సహించారు. ఇలాంటి మీకు ఉన్నత స్థానం దక్కడం చాలా సంతోషంగా ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published.