అమ‌రావ‌తి: విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామ‌ని మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాం. డెంగ్యూ, మలేరియాను ఆరోగ్య శ్రీలో చేర్చాం. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులు దుబారా చేశారు.

మా ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నాం. విషజ్వరాలపై అవగాహన కల్పిస్తున్నాం. వెక్టార్ కంట్రోల్ యాప్ తో అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. నాతో సహా అధికారులు రివ్యూ చేస్తున్నాం. పంచాయ‌తీ రాజ్ అధికారులతో రివ్యూ చేశాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం క్యాంపులు నిర్వహించాం. విషజ్వరాలపై ధైర్యంగా పోరాడుతున్నాం. సంధ్య మరణం కలచి వేసింది. ఇది బాధాకరం. సంధ్య తండ్రి కూడా అనారోగ్యంతో భద్రాచలంలో ఆస్పత్రిలో చేరారు. సంధ్యకు జ్వరం పెరగడం, ప్లేట్ లెట్స్ బాగున్నాయి. తండ్రీ కూతురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చింతూరు ఆస్పత్రికి సంధ్యను మళ్ళీ జాయిన్ చేశారు. సంధ్యకు బాగా లేకపోవడంతో సంధ్య మరణించింది. చిన్నారి మృతిని టీడీపీ సభ్యులు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published.