టీఆర్ఎస్ ప్లీనరీ ( TRS pleanary ) సమావేశాలు అయిపోయిన తర్వాత జీఎహెచ్‌ఎంసీ ( GHMC ) అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సంధర్బంగా నగర వ్యాప్తంగా పార్టీకి చెందిన వారితో పాటు నగరంలోని మంత్రుల పేరుతో ఫ్లేక్సీలు వెలిశాయి. దీంతో కాంగ్రేస్‌తో పాటు పలువరు పార్టీ ఫ్లెక్సీలపై ఫిర్యాదు ( complaint ) చేశారు. దీంతో ఫ్లెక్సీల ఏర్పాటుపై దుమారం రేగింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డిపార్ట్‎మెంట్ స్పందించింది. గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ ఎన్‎ఫోర్స్‎మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైన్లను నిలిపేసిన అధికారులు.. నేటి నుంచి మళ్లీ ఫైన్లను వేయడం ప్రారంభించారు. ప్లీనరీ సందర్భంగా బంజారా‎హిల్స్ రోడ్ నెంబర్ 3లో కటౌట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‎కు జీహెచ్ఎంసీ 30 వేల రూపాయల ఫైన్ విధించింది. అదేవిధంగా మంత్రి తలసానికి 5 వేల రూపాయల ఫైన్ విధించింది. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగానే స్పందించకుండా.. అంతా అయిపోయాక, తూతూ మంత్రంగా ఎన్‎ఫోర్స్‎మెంట్ డిపార్ట్‎మెంట్ చలాన్లు విధించిందని పలు విమర్శలు వస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.