అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,896 పరీక్షలు నిర్వహించగా.. 381 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,365కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 414 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,46,127 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4,743 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.