అమరావతి: డేటా దొంగ చంద్రబాబు..డేరా బాబా కంటే డేంజర్‌ అని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మంగళవారం మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడారు.
ప్రజల డేటాను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసాధికారత సర్వే పేరుతో సేవా మిత్ర ద్వారా టీడీపీ నాయకులకు విలువైన సమాచారాన్ని అందించారు. డేటాను చోరీ చేయాలనే ఈ దుష్ట సాంప్రదాయానికి తెర లేపారు. దానిపై హౌస్‌ కమిటీ వేసి ఈ రోజు ఆ రిపోర్టును హౌస్‌ కమిటీ పెట్టగానే టీడీపీ నేతల గుండెలు జారాయి. దీనిపై చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే కచ్చితంగా జీవితాంతం జైల్‌లో ఉంటారు. ఈ డేటా దొంగ డేరా బాబా కన్న డేంజర్‌ అన్నది గమనించాలి. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ సాప్ట్‌వేర్‌ చంద్రబాబు కొనుగోలు చేశారని ఆమె చెప్పారు. ప్రజా సాధికారత సర్వేలో మొత్తం డేటా తీసుకున్నారు. టీడీపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే..దాదాపు 30 లక్షల ఓటర్లను తొలగించాలని దుర్మార్గంగా ఆలోచన చేశారు. దీనిపై సమగ్ర విచార ణ జరగాలి. ఓటర్లు డిలీట్‌ చేయడమే కాకుండా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ చేయించుకొని, వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి ఆ రోజు టీడీపీ చేర్చుకున్నారు. ఇలాంటి వాళ్లను వదిలిపెడితే సమాజం భ్రష్టుపడుతుంది.
లోకేష్‌ను చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఒళ్లు తగ్గించడానికి ఏవేవో చేశాడు. ఒళ్లుతో పాటు బు్రరలో ఉన్న గుజ్జు కూడా పెంచుకోవడానికి ఏదైనా చేస్తే బాగుంటుంది. అసెంబ్లీలో ఇచ్చిన టీడీపీవాయిదా తీర్మానం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అన్నా క్యాంటీన్లపై మొదటి సంతకం చేయాలి. ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన మీరు ఈ రోజు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారో చర్చకు సిద్ధమా?

By admin

Leave a Reply

Your email address will not be published.