చిత్తూరు: ఈనెల 22న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. 22వ తేదీ ఉదయం 9.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం, 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15 – 12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని, వైయస్ఆర్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

By admin

Leave a Reply

Your email address will not be published.