కడలూరు జిల్లా బన్రుట్టి సమీపంలోని విశూరు మారియమ్మన్‌ వీధికి చెందిన గురుమూర్తిని గుర్తు తెలియని వ్యక్తి రూ.1.35 లక్షల మేర మోసం చేశాడు. గురుమూర్తి ఏటీఎం కార్డు(ATM card)తోనే ఆయన బ్యాంకు ఖాతా నుంచి ఈ నగదు విత్‌డ్రా చేశాడు. బాధితుడు స్థానిక అన్నాడీఎంకే విభాగం కోశాధికారిగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఈపీఎస్‌ పిలుపు మేరకు శుక్రవారం అన్నాడీఎంకే శ్రేణులు విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. వడలూరులో గురుమూర్తి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. దాని తర్వాత కార్యకర్తలకు టీ, కాఫీ, ఇతర తినుబండరాలు కొనిచ్చేందుకు అవసరమైన నగదు విత్‌డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్ళగా అక్కడ విత్‌డ్రా చేయడంలో సమస్య ఏర్పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి చేతికి ఏటీఎం కార్డు, పిన్‌ నంబరు చెప్పి డబ్బు తీసివ్వమని కోరాడు. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి రూ.1000 నగదు డ్రా చేసి, నకిలీ కార్డును గురుమూర్తి(Gurumurthy) చేతిలో పెట్టిమాయమైపోయాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.