అమ‌రావ‌తి: ఎన్టీరామారావు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీలో ఏ ఒక్కరికీ లేద‌ని మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు. తెలుగుదేశం సభ్యుల ప్రవర్తన చాలా దురదృష్టకరం అన్నారు. రెడ్ లైన్ దాటి, స్పీకర్ పోడియం వద్దకు వచ్చి, దౌర్జన్యం చేస్తూ, కాగితాలు చించి పైకి విసురుతున్నారన్నారు.
ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న పచ్చకాగితాలు తెచ్చి చించి పడేయడం చూస్తే వారికి వాళ్ల నాయకుడు ఎన్టీరామారావు మీద ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోందని అన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు సభను బహిష్కరించి వెళ్లిపోయాడు, ఇతర నాయకులు రోజూ వచ్చి, బహిష్కరణకు గురయ్యేదాకా గొడవ చేస్తారన్నారు అంబటి.
ఎన్టీ రామారావుగారు మాకు చాలాకాలం రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనకు గౌరవం ఇవ్వకూడదని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం సైతం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు వైద్యులు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీని తెచ్చిన ఆ మహానుభావుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ మరణించాక టీడీపీ ఆయనను ఏమాత్రం గౌరవించలేదని,
ఎన్టీఆర్ ను అవమానించింది చంద్రబాబే అని తెలిపారు. అధికారం కోసం వెన్నుపోటు పొడిచి, ఎన్టీరామారావు కుటుంబాన్ని చిందరవందర చేసిన వ్యక్తి చంద్రబాబే అన్నారు అంబటి.

By admin

Leave a Reply

Your email address will not be published.