అమ‌రావ‌తి: హెల్త్ యూనివర్శిటీకి మ‌హానేత, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు పెట్ట‌డం స‌మంజ‌స‌మేని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎన్టీఆర్‌గారంటే అంటే నాకు ఎలాంటి కోపం లేదు. ఒకరకంగా.. ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడుగారి కంటే జగన్‌మోహన్‌రెడ్డినే ఎక్కువ గౌరవం ఇస్తాడు. యూనివ‌ర్సిటీ పేరు మార్చడానికి అనేక విధాలుగా ఆలోచించాక.. కరెక్ట్ అనిపించాక అడుగులు ముందుకు వేశానన్నారు. ఏపీలో అమలవుతున్న 108, 104 పథకాలకు సృష్టికర్త వైయ‌స్ఆర్‌, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, డాక్టర్ వైయ‌స్ఆర్‌. కుటుంబంలో వ్యక్తి వైద్యం అందక మరణిస్తే కుటుంబం ఎలా తట్టుకోలేకపోతుందో ఆయనకు తెలుసు. ఖరీదైన కార్సొరేట్ వైద్యాన్ని పేదలకు అందించారు మానవతావాద మహా శిఖరం వైయ‌స్ఆర్ అని కొనియాడారు. ఆరోగ్యరంగంలో వెలిగే సూర్యుడు వైయ‌స్ఆర్‌ . ప్రధానితో సహా అంతా కొనియాడే వ్యక్తి వైయ‌స్ఆర్‌ అన్నారు వైయ‌స్ జగన్. ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలు వున్నాయి. ఇందులో 8 కాలేజీలు టీడీపీ పుట్టకముందే వచ్చాయి. శ్రీకాకుళం, ఒంగోలు, కడప కాలేజీలు పెట్టింది వైయ‌స్ఆర్‌ . మొత్తం 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైయ‌స్ఆర్‌, ఆయన కొడుకు వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏర్పాటవుతున్నాయి. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు. తమ ప్రభుత్వం వుందని తమకిష్టమయిన పేరు పెట్టుకున్నారు. క్రెడిట్ ఇవ్వాల్సిన వారికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా? మాకు ఎన్టీఆర్ అంటే కల్మషం లేదు. ఆయన పై అభిమానం వుంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.