తాడేపల్లి: 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు అధికారం కోల్పోయిన తరువాత 40 నెలలకు బీసీలు గుర్తుకు వచ్చారా అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. బీసీలు చంద్రబాబును మరిచిపోయారని, ఆయన చేసిన మోసాలు ఎప్పటికీ వారు మర్చిపోరని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏపీ కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు 40 నెలల తరువాత ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, వారు నిన్ను విడిచివెళ్లారని కొత్తగా చేసే కొంగ జపం ఈ రాష్ట్ర బీసీ ప్రజానీకం గమనిస్తుందని చంద్రబాబు ఎరగడం లేదా? . రాష్ట్రంలో 142 కులాలు ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు పరిపాలన, 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. రాష్ట్రంలో కేవలం 11 కార్పొరేషన్లు ఉంటే, ఎన్నికలకు ముందు 2019 జనవరిలో మరో 15 పెంచారు. అంటే మొత్తం 26 కార్పొరేషన్లు. అధికారం వచ్చిన వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఉంటే బీసీలు నమ్మేవారు. ఎన్నికల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశావని ప్రజలు గ్రహించబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పారు.
కుల వృత్తులు ఉన్న వారికే ఆదరణ అంటూ ఓ పథకం తెచ్చారు. ఈ పథకం ఏ మేరకు ఆదరించిందో చూశాం. ఆదరణ పేరుతో ఎంత మందికి మోసం చేశావో ప్రజలకు తెలుసు. సర్పంచ్‌ల అధికారాన్ని జన్మభూమి కమిటీలకు కట్టబెట్టారు. పింఛన్లు మంజూరు చేయాలంటే జన్మభూమి కమిటీలతో సంతకాలు తీసుకున్నారు. ఆదరణ పథకం పొందాలంటే జన్మభూమి కమిటీ సిపార్స్‌లు కోరారు. అర్హులకు అన్యాయం చేసింది వాస్తవం కాదా?.
ఆదరణ పథకానికి కేవలం రూ.98 కోట్లు ఇచ్చారు. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో మూడేళ్లలోనే బీసీలకు రూ. 226 కోట్లు ఇచ్చారు. ఎంపికలో పారదర్శకత ఉంది. వాలంటీర్‌ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎంపిక చేపట్టారు. డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు ఇస్తున్నాం. చంద్రబాబు నీవు ఇచ్చింది ఏంటి? ఇస్తీ్ర పెట్టే, తాళ్లు, మోకులు మాత్రమే. ఇవాళ మా ప్రభుత్వం టైలర్‌కు రూ.10 వేలు, అదే ఇంటికి అమ్మ ఒడి, వైయస్‌ఆర్‌ చేయూత, రైతు భరోసా, జగనన్న వసతిదీవెన, విద్యాదీవెన, పింఛన్‌ కానుక ఇస్తున్నాం.

By admin

Leave a Reply

Your email address will not be published.