రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్స్‌, క్లినిక్స్‌, కన్సల్టేషన్‌ రూమ్స్‌, పాలీ క్లినిక్కులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఫిజియోథెరపీ యూనిట్స్‌, డెంటల్‌ ఆస్పత్రులు.. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్స్‌ లేకుండానే నడుస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగిన తర్వాతే వాటికి అనుమతులు లేవన్న విషయం బయటపడుతోంది. ఇలాంటి ఆస్పత్రులు, సిబ్బందిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా ఝుళిపించేందుకు సర్కారు సిద్ధమైంది. అంతేకాకుండా కొన్ని ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుకోలేదు. ముఖ్యంగా మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌, శానిటేషన్‌, అలాగే ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ విషయంలో నిబంధనలను పాటించడం లేదు. ఈ విషయాలన్నీ కూడా వైద్యశాఖ దృష్టికి వచ్చాయి

By admin

Leave a Reply

Your email address will not be published.